1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Theft in actor Chiranjeevi's house

చిరు ఇంట్లో చోరీ.. ఉడాయించిన సర్వర్ చెన్నయ్య

నిత్యం వచ్చిపోయేవారితో సందడిగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ.2 లక్షల డబ్బాతో సర్వర్ చెన్నయ్య ఉడాయించినట్టు సమాచారం. ఈ విషయం చిరంజీవి వ్యక్తిగత మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింద

Chiranjeevi
నిత్యం వచ్చిపోయేవారితో సందడిగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ.2 లక్షల డబ్బాతో సర్వర్ చెన్నయ్య ఉడాయించినట్టు సమాచారం. ఈ విషయం చిరంజీవి వ్యక్తిగత మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
చిరంజీవి నివాసం జూబ్లీహిల్స్‌లో ఉంది. ఈ ఇంట్లో పనిచేసే సర్వర్ చెన్నయ్య అలియాస్ చిన్నా పని చేస్తున్నాడు. ఆయన రూ.2 లక్షల డబ్బుతో ఉడాయించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
చిరంజీవి వ్యక్తిగత మేనేజర్ గంగాధర్ ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. చిరంజీవి మేనేజర్ ఫిర్యాదుతో చెన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హెలికాప్టర్ ప్రమాదంలో సౌదీ యువరాజు దుర్మరణం... చంపేశారా?