1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tirumala temple crowded with devotees as queue complex reaches full capacity

తిరుమలకు పోటెత్తిన భక్తులు - శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Lord Venkateswara
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఫలితంగా శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఉదయం అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. వారంతం కావాడంతో పాటు వర్షాలు తగ్గుముఖం పట్టి, వాతావరణం అనుకూలించడంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారని పేర్కొన్నారు. 
 
భక్తులు తాకిడి పెరగడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు కాంప్లెక్స్ వెలువల ఉన్న క్యూలైనలో దర్శనం కోసం వేచివున్నారు. పెరుగుతున్న రద్దీని క్రమబద్దీకరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) యంత్రాంగం తగిన చర్యలు చేపడుతోంది. 
 
శనివారం ఒక్కరోజే 82,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 37,633 మంది తలనీలాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.3.94 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత వచ్చిన పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాత్రి పౌర్ణమి గురడసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని గరుడ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శనం చేసుకుని తరించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఈఎంఐల రూపంలో లంచం : ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ అధికారిణి (వీడియో)