శ్రీవారి భక్తులకు అలెర్ట్ : ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే ఓ సూచన చేసింది. జూలై నుంచి సెప్టెంబరు వరకు పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులు సూచించారుూ. ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా తేదీలకు ముందురోజు తిరుమలలో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు, కారణాలివే..
జులై 14 - కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
జులై 17 - ఆణివార ఆస్థానం
జులై 19 - శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
జులై 29 - జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
ఆగస్టు 22 - పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఆగస్టు 24- పవిత్రోత్సవాల రెండోరోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ
సెప్టెంబరు 8 - శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సెప్టెంబరు 14 - శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సెప్టెంబరు 15 - నుంచి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
