సంబంధిత వార్తలు
- వణికిపోతున్న తెలంగాణ... వలస కూలీలను తరలిస్తున్న సర్కారు
- లాక్ డౌన్, మీ మోటారు లేదా కారు స్టార్ట్ కావడంలేదా? డ్రూమ్ జంప్‌స్టార్ట్ సర్వీస్ సిద్ధం
- లాక్డౌన్లో కదిలిన తొలి రైలు.. లింగంపల్లి నుంచి హతియాకు బయలుదేరింది..
- ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్ళ రాకపోకలు... 'జర్నీ'కి ఆంక్షలు
- సల్మాన్ పెద్ద మనసు : 25 వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ
ఏపీలో జూనియర్ కాలేజీలు ఎప్పటి నుండి ప్రారంభం?
ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఆగస్టు 3 నుండి కాలేజీలను ప్రారంభించాలని ఇందులో మొత్తం 196 రోజులు పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు 2021 అకడమిక్ క్యాలండర్‌ను సిద్దం చేసిన ఉన్నత విద్యాశాఖ, సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొన్నది.
ఇక ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులను నిర్వహించాలని, రెండో శనివారం కూడా కాలేజీలను నడిపించాలని, పండుగుల సందర్భంలో మాత్రం ఒకటిరెండు రోజులు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అదేవిధంగా విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని ఆన్లైన్ పాఠాలు నిమిత్తం వీడియోలను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది.
యధావిధిగా వచ్చే ఏడాది మార్చిలోనే వార్షికలు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక ప్రతి సబ్జెక్టుకు ఒక వర్క్ బుక్ ప్రత్యేకంగా ఇస్తామని, జేఈఈ మెయిన్ పరీక్షలుకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని స్పష్టం చేసింది.
