1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YCP Firebrand Pedda Reddy Arrested

Pedda Reddy: అక్రమ ఆస్తుల కేసు... తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

Kethireddy
Kethireddy
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి చెందినవారు. 2019లో జేసీ కుటుంబంపై తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో విజయం సాధించారు. కానీ ఈ నియోజకవర్గంలో కేతిరెడ్డి ఆధిపత్యం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎందుకంటే 2024లో బలమైన టీడీపీకి చెందిన జేసీ అస్మిత్ రెడ్డి తిరిగి సీటును గెలుచుకున్నారు.
 
తాజా వార్త ఏమిటంటే, కేతిరెడ్డిపై అనేక సంఘ వ్యతిరేక కేసులు, అక్రమ ఆస్తులు నమోదు చేయబడిన కారణంగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయనను తాడిపత్రిలోని తన ఇంట్లో అరెస్టు చేశారు.
 
పెద్దారెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఇక్కడ ఉండేందుకు వీల్లేదంటూ ఆయన్ను అనంతపురానికి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి.

పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రి రావడంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లవద్దని పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు.
About Writer
సెల్వి