1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Youth attack on 9 year old boy sexual assault

జామాయిల్ తోటలో తొమ్మిదేళ్ళ బాలుడిపై యువకుడి లైంగికదాడి

ఇటీవలికాలంలో బాలికపై యువతులు, మైనర్ బాలుర్లపై యువకులు లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నారు. నిన్నటికి నిన్న తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన ఓ బాలికపై యువతి అత్యాచార యత్నానికి పాల్

boy
ఇటీవలికాలంలో బాలికపై యువతులు, మైనర్ బాలుర్లపై యువకులు లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నారు. నిన్నటికి నిన్న తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన ఓ బాలికపై యువతి అత్యాచార యత్నానికి పాల్పడింది. ఇపుడు ఓ తొమ్మిదేళ్ళ బాలుడుకి డబ్బు ఆశ చూపి ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
 
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని రమణారెడ్డిపాలెంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ జాతర చూసేందుకు తొమ్మిదేళ్ల బాలుడు వీధిలోకి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన సోబత్తిన వెంకటేశ్‌ అనే యువకుడు ఆ బాలుడి దగ్గరకు వచ్చి తనతో వస్తే డబ్బులు ఇస్తానని ఆశ పెట్టాడు. దీంతో ఆ బాలుడు యువకుడి మోటార్ సైకిల్ ఎక్కాడు. వీరిద్దరూ కలిసి ఊరికి దూరంగా ఉన్న జామాయిల్‌ తోటలోకి తీసుకెళ్లి... బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత తిరిగి తీసుకొచ్చి గ్రామంలో వదిలిపెట్టాడు. అయితే ఆ బాలుడు వెక్కివెక్కి ఏడుస్తుండటంతో తండ్రి ఏం జరిగిందనీ ఆరా తీయగా అసలు విషయం వెల్లడించాడు. దీంతో బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలంగాణలో జనసేన-సీపీఎం పొత్తు.. త్వరలోనే తమ్మినేని-పవన్ భేటీ