మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (18:10 IST)

స్వర్గం చూపిస్తానని.. గదికి పిలిచి అబ్బాయిని కుమ్మేసిన అమ్మాయిలు.. ఎందుకు..?

సోషియల్ మీడియా ఉన్నది పరిచయాలు డెవలప్ కావడానికే. కానీ అడ్డగోలు వ్యవహారాలను నడపడానికి మాత్రం కాదు. ఇలా చేస్తే ఎవరికైనా తగిన శాస్త్రి జరుగుతుందని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఒక తుంటరి కుర్రాడికి, మరో ట

సోషియల్ మీడియా ఉన్నది పరిచయాలు డెవలప్ కావడానికే. కానీ అడ్డగోలు వ్యవహారాలను నడపడానికి మాత్రం కాదు. ఇలా చేస్తే ఎవరికైనా తగిన శాస్త్రి జరుగుతుందని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఒక తుంటరి కుర్రాడికి, మరో టెంపర్ అమ్మాయి ఇచ్చిన బదులు అంతా ఇంతా కాదు.
 
అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి. ఇదేం సినిమా టైటిల్ కాదు. అలాంటి ఇద్దరిని కలిపింది ఇన్‌స్టాగ్రామ్. ఇంతవరకు బాగానే ఉంది. ఇద్దరి మధ్యా అంతా సాఫీగానే సాగింది. ఇనస్ట్రాగ్రామ్‌లో ఒకరి ఫోటోను మరొకరు షేర్ చేసుకోవడం వరకు వచ్చింది. అమ్మాయి ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా బాగా కలగలిసి పోవడంతో బాగా ధైర్యం పెంచుకున్నాడు ఆ అబ్బాయి. ఇక తాను ఏదగడినా ఇంచేస్తుందని గట్టిగా ఫిక్సయిపోయాడు. 
 
వరంగల్ నగరానికి చెందిన యువకుడు రాజ్. యువతి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్న వాణిశ్రీ. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పీకల్లోతు చిట్ చాట్‌లు, షేరింగ్‌లు. అంతే ఇక తన మనస్సులోని ప్రేమను ఆ అమ్మాయికి చెప్పేశాడు యువకుడు. ఎందుకో ఆమె నో చెప్పింది. దీంతో యువకుడికి తిక్కరేగింది.
 
ఈ పరిచయాన్ని పడకగది వరకు తీసుకెళ్ళాలన్నది యువకుడి ఆలోచన. అతని వక్రబుద్దిని గుర్తించిన యువతి అతని ప్రేమకు నో చెప్పేసింది. అయినా సరే యువకుడు ఒప్పుకోలేదు. ఎలాగైనా ఆమెను ముగ్గులో దించాలని గట్టిగా ఫిక్సయ్యాడు. ప్రేమించకపోతే పోయావు. నాతో పడకపంచుకో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాడు. ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడని యువతి పరిపరి విధాలుగా ఆలోచించింది.
 
ఇతనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఎక్కడ రావాలో కూడా నువ్వే చెప్పు అంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆ యువతి సరే కలుద్దామంటూ మెసేజ్ పెట్టి హైటెక్ సిటీలోని హాస్టల్‌కు రమ్మంది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాడు. హాస్టల్ గదిలోకి తీసుకెళ్ళిన యువతి తన స్నేహితులతో కలిసి చావబాదింది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత మాదాపూర్ పోలీస్టేషన్‍కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. 
 
విషయం తెలుసుకున్న యువతి కూడా అతనిపై ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఇది మొత్తం రెండు కుటుంబాల కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీస్టేషన్‌కు వచ్చి కాంప్రమైజ్ అయి అక్కడి నుంచి ఇద్దరినీ తీసుకెళ్ళిపోయారు. సోషియల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త ఉండాలని ఈ ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది.