మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-04-2021 శుక్రవారం దినఫలాలు - కుబేరుడిని పూజించినా...

మేషం : వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఏకాభిప్రాయం కుదరదు. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. 
 
వృషభం : నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు అనుకూలం. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ సంతానం విద్యా వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. దూరంగా ఉన్న ఆత్మీయులను కలుసుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది. సోదరులతో ఆస్తి విషయంలో సంప్రదింపులు జరుపుతారు. 
 
మిథునం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలత ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వింటారు. ప్రయాణాలలో మెళకువ వహించండి. భాగస్వామిక చర్చల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కవి పండిుతులకు, ప్రముఖులకు ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. 
 
కర్కాటకం : వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు చికాకులు అధికం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు, ఆశిస్తున్న ప్రమోషన్ త్వరలోనే అందుతుంది. ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. గతంలో ఒకరికి హామీ ఇవ్వడం వల్ల ఇబ్బందులెదురవుతాయి. 
 
సింహం : రావలసిన ధనం చేతికందుతుంది. ఇతరులకు అతి చనువు ఇవ్వడం వల్ల మంచిదికాదని గమనించండి. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
తుల : మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ఉద్యోగులకు రావలసిన క్లైయిమ్‌లు, అలవెన్సులు మంజూరవుతాయి. 
 
వృశ్చికం : చిన్న చిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఏదైనా స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కుటుంబ సౌఖ్యం వాహన యోగం పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
ధనస్సు : వస్త్ర, బంగారు, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారివల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో అవగాహన ఏర్పడుతుంది. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన కాంట్రాక్టులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. 
 
కుంభం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తప్పవు. ఒక వ్యవహారంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. ప్రయాణాల్లో స్వల్ప చికాకులు తప్పవు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. వాతావరణంలో మార్పు, శారీరక శ్రమ వల్ల మీ ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మీనం : ఆర్థిక పరిస్థితి మనుపటి కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. చిన్నచిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు.