గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-03-2021 సోవవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినా...

మేషం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. ఏ సమస్యనైనా నిబ్బరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాలలో ఆసక్తి అధికమవుతుంది. రాజకీయాలలో వారికి గుర్తింపుతో పాటు.. చికాకులు తప్పవు. 
 
వృషభం : ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుది. అతిథి మర్యాదలు  బాగుగా నిర్వహించడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థులు పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడుతాయి. 
 
మిథునం : మీ వాహనం పిల్లలకు, ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. మీ అవసరాలు, బలహీనతలు గమనించి ఇతరులు మిమ్ములను మోసగించేందుకు యత్నిస్తారు. ఫ్లీడరు, ఫ్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు బాధ్యతలతో పాటు పనిలో ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల పట్ల చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. హోటల్, తినుబండారాలు, చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
సింహం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవచ్చును. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. ధనం బాగా అందుట వల్ల ఏ కొంతైనా నిల్వచేయలగలుగుతారు. 
 
కన్య : భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా ముగుస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యా రంగాలవారికి శుభప్రదం. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
తుల : ఒకరికి సహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి లోనవుతారు. శ్రీవారు, శ్రీమతి వైకరి వల్ల ఉల్లాసం కలిగిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబ అవసరాలు, రాబడికి మంచిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చిన్న తప్పిదమైనా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం : ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆప్తులతో పుణ్యక్షేత్ర సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. 
 
ధనస్సు : నిరుద్యోగులు ఊహాగానాలతో కాలం వ్యర్థంచేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
మకరం : స్త్రీలు, ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తూ సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు హోదా పెరిగే సూచనలున్నాయి. మీ పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సనుకూలమవుతాయి. మీ అభిప్రాయం చెప్పడానికి సందర్భం వస్తుంది. 
 
కుంభం : వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. 
 
మీనం : కొంతమంది మీ గురించి చాటుగా విమర్శలు చేసే ఆస్కారం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. బంధు మిత్రులలో మీకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా ఉండాలి.