గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-03-2021 గురువారం దినఫలాలు - రాఘవేంద్ర స్వామిని పూజించినా...

మేషం : బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం వాహనం మరమ్మతులకు గురవుతుంది. విదేశీయానయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితుల్లో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. 
 
వృషభం : పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సానుకూలమవుతాయి. పత్రికా సంస్థలలోని వారికి ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సంతృప్తి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులు, విద్యుత్ సమస్యలు అధికం. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. 
 
మిథునం : వృత్తి వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు ఇతరులకు మార్గదర్శకమవుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. అవసరానికి రుణాలు సకాలం అందవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అడ్డంకులు తొలగిపోగలవు. 
 
కర్కాటకం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. తరచూ అధికారులు, నేతలతో సంప్రదింపులు జరుపుతారు. శత్రువులు, మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కోర్టు వ్యవహారాలు హియరింగ్‌కు వస్తాయి. ఒక ఆహ్వానం మిమ్మలను ఇబ్బందికి గురిచేస్తుంది. 
 
సింహం : సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరగడంతో పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
కన్య : బంధువుల ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొత్త వ్యక్తులను అతిగా నమ్మడం మంచిందికాదు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
తుల : వ్యవసాయ తోటల రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. స్త్రీలు షాపింగ్‌లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. 
 
వృశ్చికం : బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు, ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. పెద్దమొత్తం ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా ఉండాలి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి. 
 
ధనస్సు : ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. దుబారా నివారించలేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. సాహస యత్నాలకు సరైన సమయం కాదని గ్రహించండి. ప్రయాణాలకు అనుకూలం. 
 
కుంభం : పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదావేయండి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. సర్టిఫికేట్లు, హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సహాయంతో వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు. 
 
మీనం : మీ అభిప్రాయం చెప్పడానికి సందర్భం వస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంతికభావంతో పనిచేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు.