మేషం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. రాజకీయ నాయకులకు విదేశీయాన ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. వృషభం : నిరుద్యోగులకు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సినిమా, సంగీత, నృత్య...