సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-12-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే...

మేషం : భాగస్వామిక చర్చల్లో మ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రేమయం లేకుండా జాగ్రత్త వహించండి. రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించుకుంటారు. 
 
వృషభం : ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. బంధు మిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. 
 
మిథునం : బ్యాంకు పనులు, దూర ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. కూర, పండ్లు, కొబ్బరి, ధాన్యం స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. శ్రమాధిక్యత, వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు రావలసిన క్లైమ్‌లు మంజూరవుతాయి. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగలవసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
సింహం : ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదుటపడుతుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. 
 
కన్య : రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
తుల : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. మీ కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ఏకాగ్రత లోపించడం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళన నెలకొంటుంది. 
 
వృశ్చికం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి సదావకాశాలు లభిస్తాయి. మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. 
 
ధనస్సు : బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయం చేస్తారు. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధానపరుస్తారు. దుబారా ఖర్చులు అధికం. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ ఆంతరంగిక, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. 
 
కుంభం : ఆర్థిక ఒడిదుడుకుల వల్ల చికాకులను ఎదుర్కొంటారు. మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. 
 
మీనం : గృహ నిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఆదాయ వ్యయాలను మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు.