మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు-సూర్య నారాయణ పారాయణ చేసినా?

సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం: స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. కుటుంబ వ్యవహారంలో మొహమ్మాటం, ఒత్తిళ్లకు తావివ్వకండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం: మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. బేకరి, స్వీట్స్, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆకస్మిక సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. స్త్రీల రచనలు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం: ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, కానుకలు అందజేస్తారు. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను గుర్తిస్తారు. లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. మార్కెట్ రంగాల వారికి, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు ఏజెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరగలదు. 
 
కర్కాటకం: ఉద్యోగస్తులు సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బేకరి, స్వీట్స్, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాల్లో అనుకూలత, కొత్త అనుభూతికి లోనవుతారు. దుబారా ఖర్చులు అదుపు చేయగలుగుతారు. 
 
సింహం: ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. విద్యార్థుల్లో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులెదుర్కొన్నా రావలసిన ధనం అందడంతో కుదుటపడతారు. 
 
కన్య: కష్టసమయంలో అయిన వారికి అండగా ఉంటారు. మీ శ్రీమతి వైఖరి మరింత చికాకుపరుస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయజాలవు. మొండి బాకీలు వసూలు కాగలవు. మీ ప్రమేయంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది.
 
తుల: పత్రికా, పారిశ్రామిక సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అరియర్స్ మంజూరవుతాయి. 
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రధాన కంపెనీల షేర్ల విలువలు తగ్గే సూచనలున్నాయి. స్త్రీలకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
మకరం: మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. అయిన వారే సాయం చేసేందుకు సందేహిస్తారు. 
 
కుంభం: మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. మొహమ్మాటాలకు పోయి ఇబ్బందులెదుర్కుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. వ్యవహారాల్లో కచ్చితంగా ఉండాలి. గుట్టుగా యత్నాలు సాగించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. 
 
మీనం: కీలకమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఖర్చులు మీ స్థోమతకు తగినట్లే వుంటాయి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.