మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-12-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల...

మేషం : ఓర్పు సర్దుబాటు ధోరణితో వ్యవహరించడంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. దైవ, పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. 
 
వృషభం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషం వల్ల చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మీ వాగ్ధాటి, చాకచక్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
మిథునం : ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. కలప, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కోళ్లు, మత్స్యు, గొర్రెల వ్యాపారస్తులకు ఏకాగ్రత అవరం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. నూతన పరిచయాలేర్పడతాయి. 
 
కర్కాటకం : స్త్రీలకు కళా రంగాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. దైవ, సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం : భాగస్వామిక చర్చలు అసంపూర్తిగా ముగుస్తాయి. ఇంటా, బయటా మీ మాటకు ఆదరణ లభిస్తుంది. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. రావలసిన ధన చేతికందడంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి
 
కన్య : మిర్చి, నూనె, కంది వ్యాపారస్తులకు స్టాకిస్టులకు ఆశాజనకం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. సభా, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
తుల : ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. 
 
వృశ్చికం : ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తెలత్తుతాయి. ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సోదరీ, సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారస్తులకు సంతృప్తి. పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. బంధు మిత్రుల మధ్య సంత్సంబంధాలు నెలకొంటాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. 
 
మకరం : గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. పాత రుణాలు తీరుస్తారు. విద్యార్థులు మొండివైఖరి అవలంభించుట వల్ల మాటపడక తప్పదు. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. పూర్వపు పరిచయ వ్యక్తుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం : నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు లాభదాయకం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు నెలకొంటాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి కలిసివచ్చే కాలం. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది.