మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-12-2020 గురువారం దినఫలాలు - దత్తాత్రేయ స్వామిని ఆరాధించినా...

మేషం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఊహించని చికాకులను ఎదుర్కొంటారు. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ముఖ్యులతో సంప్రదింపులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. 
 
వృషభం: నూతన కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం లభించదు. ఉపాధ్యాయులకు గుర్తింపు. వైద్య రంగాల్లో వారికి చికాకు తప్పదు. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. 
 
మిథునం: ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల అధికారులు కొత్త సమస్యలెదుర్కోవలసి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. 
 
కర్కాటకం: మీ ఏమరుపాటుతనం వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఆత్మీయుల అతిథి మర్యాదలు సంతృప్తినిస్తాయి. కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలు దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రావసిన ధనం అందడంతో కుదుటపడతారు. 
 
సింహం: వ్యాపార వ్యవహారాలలో మెళకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. దంపతులకు సంతాన ప్రాప్తి కలదు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడతారు. 
 
కన్య: ఇతరులకు సలహా ఇవ్వడం వల్ల మాటపడవలసి వస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. వాతావరణంలోని మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభదాయకం. మీ నూతన ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. 
 
తుల: ఫైనాన్స్, చిట్‌ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నూతన వ్యాపారాలు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలలో లాయర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం: మిమ్మల్ని కొంతమంది ఆర్థిక సహాయం అర్థించవచ్చు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలు అధికమవుతాయి. రవాణా, ఎగుమతి రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. భాగస్వామ్యుల మధ్య భిన్నభిన్న అభిప్రాయాలు తలెత్తుతాయి. రాని మొండి బకాయిలు సైతం వసూలు చేస్తారు.
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకుల వల్ల చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల అశ్రద్ధ వల్ల ఆలస్యాల వల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మకరం: కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీల తెలివితేటలకు, వాక్ చాతుర్యానికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రయాణాణాల్లో మీకెంతో సంతృప్తికానరాగలదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. 
 
కుంభం: వస్త్ర, బంగారు, వెండి, వ్యాపారస్తులకు శుభం, జయం చేకూరుతుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పారిశ్రామిక రంగాల్లో వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. 
 
మీనం: ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. రాజకీయాల్లోని వారికి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళన తప్పదు. పాత మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు.