మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-12-2020 బుధవారం మీ రాశి ఫలితాలు.. గాయత్రీ మాతను పూజిస్తే..?

గాయత్రీ మాతను ఆరాధిస్తే శుభం చేకూరుతుంది. 
 
మేషం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం, అభివృద్ధి లభిస్తుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటికి తెలియజేయకండి. స్త్రీలపై చుట్టుపక్కల వారి మాటల ప్రభావం అధికంగా వుంటుంది. 
 
వృషభం: వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. 
 
మిథునం: ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాట పడవలసి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. సోదరి, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ యత్నాలకు బంధువుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. 
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. తలచిన పనుల్లో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
 
సింహం: ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. 
 
కన్య: కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడుట వలన మాటపడక తప్పదు. ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యులతో విబేధాలు తలెత్తుతాయి. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్ళకు సంబంధించిన చికాకులు వంటివి అధికంగా ఎదుర్కొంటారు.
 
తుల: ఆకస్మికంగా మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయడం మంచిది. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం: ఆర్థిక స్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. 
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాల్లోనూ ప్రయాణాల్లోనూ మెళకువ అవసరం.
 
మకరం: గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మిత్రులతో కలిసి ఓ మంచి పనికి శ్రీకారం చుడతారు. కుటుంబీకుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటుచేసుకుంటాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
కుంభం: ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. డబ్బుపోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
 
మీనం: ఆర్థికస్థితి సామాన్యంగా వుంటుంది. ధనం మితంగా వ్యయం చేయడం శ్రేయస్కరం. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.