బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-11-2020 శనివారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే...

మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలమైన కాలం. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. మార్కెట్ రంగాల వారు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఏకాగ్రత అంతగా ఉండదు. 
 
మిథునం : ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు క్రీడా, క్విడ్ వంటి పోటీల్లో రాణిస్తారు. ఐరన్, టెక్నికల్ ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి పనివారి నిర్లక్ష్యం ధోరణి ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
కర్కాటకం : సన్నిహితుల కలయిక కొంత ఊరట కలిగిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు చికాకులు ఎదుర్కొంటారు. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులు మిమ్మలను అపార్థం చేసుకుంటారు. ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. రుణ వాయిదాల ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. 
 
సింహం : నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. మీ అజాగ్రత్త వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. 
 
కన్య : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. దూర ప్రాంతం నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండం మంచిది. 
 
తుల : ఆర్థికంగా పురోగమించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. సమయానికి ధనం అందకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగలవలసి ఉంటుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. 
 
వృశ్చికం : సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
మకరం : విద్యార్థినులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆకస్మిక ప్రయాణం వల్ల ఇబ్బందులు తప్పవు. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికి కృషి చేస్తారు. మీ సంతానం గురించి కొత్త కొత్త పథకాలు వేస్తారు. స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. 
 
కుంభం : అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. పరిశ్రమల స్థాపనకు వ్యాపారాల విస్తరణకు చేయు యత్నాలు అనుకూలిస్తాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. 
 
మీనం : బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబం అవసరాల వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాలు సామాన్యం. స్త్రీలతో మితంగా సంభాషించండి. నోటీసులు, ప్రముఖుల నుండి లేఖలు అందుకుంటారు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి.