మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-12-2020 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడికి అభిషేకం చేస్తే...

మేషం : కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. 
 
వృషభం : ఆర్థిక లావాదేవీలు, ఆశించినంతగా సాగవు. వ్యాపారపరంగా ఇంకాస్త ముందుకు వెళ్లి లాభాలు గడిస్తారు. ఖర్చులు పెరిగినా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాలగదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలు చుట్టుపక్కల వారి నుంచి గౌరవం, ఆదరణ పొందుతారు. 
 
మిథునం : ఆర్థిక విషయాలలో గోప్యంగా వ్యవహరించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
కర్కాటకం : దైవ, సేవా, పుణ్యకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. 
 
సింహం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు ప్రముఖులతో చర్చలు జరుపుతారు. మిత్రులను కలుసుకుంటారు. 
 
కన్య : గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు పురోభివృద్ధి. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. 
 
తుల : స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు చేయాలన్న మీ కోరిక ఫలించదు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
వృశ్చికం : ఆర్థికంగా మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. తరచూ సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడితప్పదు. 
 
ధనస్సు : వస్త్ర, బంగారు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. స్త్రీలకు ఆకస్మికంగా పొట్ట, తలకి సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. 
 
మకరం : ఉన్నదానితో సంతృప్తి చెందాలనే మీ భావం కుటుంబీకులకు నచ్చదు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. 
 
కుంభం : హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. పెద్దలకు అప్పుడప్పుడు వైద్య సేవ తప్పదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
మీనం : స్త్రీల షాపింగుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు నూతన పరిచయాలేర్పడాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.