శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-12-2020 శుక్రవారం దినఫలాలు - శ్రీమన్నారాయణుడుకి తులసీదళాలతో అర్చన చేస్తే...

మేషం : ఇతరుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఆలయ సందర్శనాల కోసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయినవారు మీ నుంచి ధనసహాయం ఆశిస్తారు. 
 
వృషభం : కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు అయినవారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
మిథునం : స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. 
 
కర్కాటకం : స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. 
 
సింహం : రాజకీయ నాయకులు, సభలు, సమాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులతో కలిసి విందులు, వేడుకల్లో పాల్గొంటారు. 
 
కన్య : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారల వల్ల నష్టపోవలసి వస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. విలాసాలకు ధనం బాగుగా వ్యయం చేస్తారు. బంధువులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
తుల : వృత్తిపరమైన ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉద్యోగస్తులకు అధికారులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
వృశ్చికం : సంఘంలో పలుకుబడిన కలిగిన వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృత్తి వ్యాపారాలు ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
ధనస్సు : కుటుంబీకులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు. ఓర్పు, నేర్పు అంకితభావంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సంతానం విద్యా విషయాలు, కళత్ర ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. 
 
మకరం : ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభిస్తాయి. తొందరపాటుతనం వల్ల ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం : ప్రముఖుల ఇంటర్వ్యూ వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. బంధు మిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. శత్రువులు, మిత్రులుగా మారతారు. స్త్రీలక ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
మీనం : రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు, మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం వల్ల క్షేమదాయకం. వాహనం ఏకాగ్రతతో నడపాలి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.