మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-12-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృశింహస్వామిని ఆరాధించడం వల్ల...

మేషం : ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. ఇంటాబయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. 
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలు, దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులకు గురవుతారు. 
 
మిథునం : రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. వృత్తుల్లో వారు, వైద్యులు తమ తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో స్త్రీలు అతిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
కర్కాటకం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు శుభం, జయం చేకూరుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
సింహం : సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కన్య : మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్ర వహిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తగలవు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యుని సలహా తప్పదు. మిత్రులను కలుసుకుంటారు. 
 
తుల : స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రుల సలహాతో నిరుద్యోగులు ఆలోచనలు ఉపాధి పథకాల వైపు కొనసాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు, అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. హోటల్, తినుబండ, కేటరింగ్ రంగాలలో వారికి కలిసిరాగలదు. 
 
ధనస్సు : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తొందరపాటు నిర్ణయాలు మీకు ఎంతో ఆవేదన కలిగిస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త మెళకువలు గ్రహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల ఒంటెత్తు పోకడ మంచిదికాదు. దైవ కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
మకరం : ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగలవలసి ఉంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
కుంభం : మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు మీదపడటంతో రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. అయినవారే మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
మీనం : స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివైన లక్షణం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.