1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 20-06-2022 Monday Daily Astrology

20-06-2022 సోమవారం రాశిఫలాలు ... శంకరుడిని పూజించినా...

Dhanur Raashi
మేషం :- ఆదాయపు లెక్కలు, తేడాలు అప్పటికప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం.
 
వృషభం :- చిన్నపాటి ఆనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవల్సివస్తుంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగా కలిసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రతలోపం వల్ల అధికారులతో మాట పడక తప్పదు.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
కర్కాటకం :- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
 
సింహం :- శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఆనవసరపు ఆలోచనలతో మనసుపాడు చేసుకోకుండా అందరితో సంతోషంగా మెలగండి.
 
కన్య :- రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు రావలసిన క్లెయింలు ఆలస్యంగా అందుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విద్యుత్, ఎ.సి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవమర్యాదలు పొందుతారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు నూతన పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఇతరుల సలహాకంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
ధనస్సు :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఇంజనీరింగ్ రంగంలోని వారికి చికాకులు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. రవాణా, ప్రకటనలు, బోధన, స్టేషనరీ, విద్యారంగాల వారికి ఆర్ధికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కుంభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మిత్రులతో ఏకీభవించలేకపోతారు. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. రుణ, ఇతర వాయిదా చెల్లింపులు సకాలంలో జరుపుతారు.
 
మీనం :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఎల్.ఐ.సి, బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెలకువ వహించండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. 
తర్వాతి కథనం
19-06-2022 ఆదివారం రాశిఫలాలు ... సూర్య నారాయణ పారాయణ చేసినా...