గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-06-2022 శనివారం రాశిఫలాలు ... వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..

kanya rashi
మేషం :- ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కోసారి మాటపడవలసి వస్తుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. దంపతులు ప్రతి విషయంలోనూ కలసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమానం పెరుగుతుంది.
 
వృషభం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా ఎదుర్కుంటారు. కుటుంబీకులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారిని మా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రదేశంలో ఆహారం, నీరు మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మిథునం :- లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. అవివాహితులకు త్వరలోనే దూర ప్రాంతాల నుండి సంబంధాలు ఖాయమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత అవసరం. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు.
 
కర్కాటకం :- విద్యుత్, ఏసీ కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికై నూతన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా పూర్తిగా అందుతుంది.
 
కన్య :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏ విషయంపై ఆసక్తి పెద్దగా ఉండదు. కీలకసమావేశాల్లో పాల్గొంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉమ్మడి స్థిరాస్తి విక్రయించే విషయంలో సోదరులతో విభేదిస్తారు.
 
తుల :- పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. మీ పనులు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు.
 
వృశ్చికం :- సంతానం పై చదువును వారి ఇష్టానికే వదిలేయండి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. మీ మాటే నెగ్గాలన్న పట్టుదల మంచిది కాదు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ధనమూలక సమస్యలు కొలిక్కి వస్తాయి.
 
ధనస్సు :- ఉద్యోగ, వ్యాపార ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
 
మకరం :- ఆరోగ్య సంతృప్తి, మానసిక ప్రశాంతత పొందుతారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులను విశ్రాంతి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమ అధికం.
 
కుంభం :- బంధువుల రాకతో పనులు అసంపూర్తిగా ముగించవలసివస్తుంది. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆకస్మిక ఖర్చులుంటాయి, అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
మీనం :- అందివచ్చిన అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్పలితాన్నిస్తుంది. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.