సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-06-2024 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. అదృష్టం ఎవరికి?

Astrology
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ చతుర్ధశి ఉ.6.47 జ్యేష్ఠ రా.6.22 రా.వ.2.26 ల4.03. ఉ. దు. 8.04 ల 8. 56 ప. దు. 12.24 ల 1.16.
 
మేషం:- బంధువుల రాకతో గృహంలో కొంత అ సౌకర్యానికి గురవుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. వాగ్వివాదాలకు దిగి సమస్మలు కొని తెచ్చుకోకండి. 
 
వృషభం :- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతుల వుతారు. సోదరీ సోదరుల నుంచి చికాకులు తప్పవు. ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరని గమనించండి.
 
మిధునం:- వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ధనం ప్రాముఖ్యత, పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు ఉదరం, మెకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికిరాగలవు.
 
కర్కాటకం:- బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత వహించండి. వీరికి దూరప్రాంతాలలో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. పై అధికారుల నుంచి విమర్శలు తప్పవు. ఎంతో శ్రమించిన మీదట కాని అనుకున్నది సాధించలేరు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.
 
సింహం:- వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, దైవకార్యాలు మానసిక ప్రశాంతతను యిస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు, సంస్థల్లో పనిచేసే వారికి తరచు యాజమాన్యం నుంచి ఇబ్బందులు ఎదురువుతాయి. 
 
కన్య: - ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ఎ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవచ్చును. సాంఘిక, శుభ కార్యాలలో వీరు మంచి గుర్తింపు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
తుల:- కుటుంబీకులతో కలిసి విందులలో పాల్గొంటారు. పెరిగిన ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్ధికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. గృహం ఏర్పరచుకోవాలనేకోరిక నెరవేరుతుంది. ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది.
 
వృశ్చికం:- పండ్లు, కొబ్బరి, పూలు చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రియల్ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు విషయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
ధనస్సు:- ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాల్లో మెలకువ వహించండి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
మకరం:- ప్రయాణాల్లో అసౌకర్యానికి గురువుతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. ఉద్యోగస్తులు స్వల్ప ఆటంకాలను, ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
కుంభం:- రావలసిన ధనం అందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు సంతృప్తి, పురోభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మీనం:- మీ సంతానం ఆహార, ఆరోగ్యంలో మెలకువ అవసరం. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి.