1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-06-2024 సోమవారం దినఫలాలు - యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది...

Astrology
శ్రీ క్రోధినామ సంII జ్యేష్ట శు॥ ఏకాదశి తె.4.23 చిత్త ప.12.35 సా.వ.6.40 ల 8.24. ప.దు. 12.23 ల 1.15, పు.దు. 2.59 ల 3.51.
 
మేషం :- మీరెంతో ప్రేమించే వ్యక్తికి, మీకు మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్తుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు షాపింగులకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం వాయిదా పడుతుంది. కొబ్బరి, పండ్ల, చల్లని పానీయ, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మిథునం :- ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. పాత అలవాట్లకు స్వస్తి చెప్పి, కొత్తవాటిని అలవర్చుకోండి. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఆకస్మికంగా మీలో వేధాంత ధోరణి కనపడుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం :- రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. పనులకు ఆటంకాలు కల్పించాలను కున్న వారు సైతం అనుకూలంగా మారతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. కొత్త ప్రదేశ సందర్శనలు, దైవదర్శనాలు ఉత్సాహాన్నిస్తాయి. దంపతుల మధ్య ఏకాగ్రతలోపం అధికమవుతుంది.
 
సింహం :- శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ అంచనాలకు తగినట్లుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది.
 
కన్య :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం వారితో సమస్యలు తలెత్తుతాయి. సోదరీ, సోదరు మధ్య ఏకీభావం కుదరదు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం వారితో సమస్యలు తలెత్తుతాయి.
 
తుల :- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల రాక వలన ఊహించని సమస్యలెదురవుతాయి. సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. స్త్రీల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి.
 
వృశ్చికం :- సినిమా, సంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కలప, ఇటుక వ్యాపారస్తులకు అనుకూలత, అభివృద్ధి కానవస్తుంది. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది.
 
ధనస్సు :- వస్త్ర, బంగారు, వెండి రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలలో వారికిశ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు.
 
మకరం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ వహించండి. విద్యార్థులకు సంతృప్తి అభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళుకువ అవసరం. ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సాగిస్తారు.
 
కుంభం :- కిరాణా,ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
మీనం :- విద్యాసంస్థలలోని వారికి అనుకూలమైన కాలం. ఊహించని ఖర్చులు అధికం. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం లోపిస్తుంది. వాయిదా చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి ఎదుర్కుంటారు. ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.