2017 నందు మీరు కార్పొరేట్ సంస్థల్లో స్థిరపడతారు(తేజశ్వి-నల్గొండ)

Dr PA Raman
Raman| Last Modified గురువారం, 23 జూన్ 2016 (20:47 IST)
తేజశ్వి-నల్గొండ: మీరు అమావాస్య, బుధవారం, కర్కాటక లగ్నం, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. 2017 నందు మీరు కార్పొరేట్ సంస్థల్లో స్థిరపడతారు. మీ అభివృద్ధికి ఈ సంవత్సరం నాంది పలుకుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ లలితా సహస్రనామం చదవడం వల్ల లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2019 నుండి శనిమహర్దశ 19 సంవత్సరములు మీరు ఉచ్ఛస్థితిలో ఉంటారు. ఉద్యానవనాల్లో మద్ది చెట్టును నాటిన శుభం కలుగుతుంది.

గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.దీనిపై మరింత చదవండి :