Raman|
Last Modified గురువారం, 23 జూన్ 2016 (20:45 IST)
సుబ్బారావు-పెద్దాపురం: మీరు ద్వాదశి, మంగళవారం, కుంభలగ్నం, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల భార్యస్థానాధిపతి అయిన రవిని రాహువు పట్టడం వల్ల వాసుకీకాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించిన శుభం కలుగుతుంది.
2016 అక్టోబరు నుండి 2017 జూన్ లోపు మీకు వివాహం అవుతుంది. వివాహ విషయంతో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. తూర్పు నుండి గానీ, పడమర నుండి గానీ సంబంధం స్థిరపడుతుంది. మంచి యోగ్యురాలైన భార్య లభిస్తుంది. 2007 ఆగస్టు నుండి శనిమహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 జూలై నుండి 2026 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ సూర్యనమస్కారం చేయండి. దేవాలయాల్లో అరటి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.