27-09-2026 నుంచి 03-10-2026 వరకు రాశి ఫలితాలు- అన్నింటా మీదే పైచేయి
Weekly Horoscope
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయం తీసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉత్సాహంగా కాలం గడుపుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. శుక్రవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. భార్యాభర్తలు ఒక అవగాహనకు రాగలుగుతారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. మీ చొరవతో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు కొత్త బాధ్యతలు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమతవుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ప్రముఖులకు చేరవవుతారు. సభ్యత్వం స్వీకరణకు అనుకూలం. ప్రతి విషయంలోను బాధ్యతగా మెలగాలి. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు జాగ్రత్త. అవివాహితులు శుభవార్త వింటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే అస్కారం ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఈ వారం అన్ని విధాలా అనుకూలం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. సంస్థల స్థాపనలకు సరైన సమయం, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. స్నేహసంబంధాలు బలపడతాయి. భార్యాభర్తలు అవగాహనకు రాగలుగుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి శ్రమిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. అతిగా శ్రమించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం, ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రుణ ఒత్తిళ్లు తొలుగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. స్నేహసంబంధాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. తరచు ఆప్తులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. సంస్థల స్థాపనలనకు అనుమతులు మంజూరవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. సంతానానికి శుభం జరుగుతుంది. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు:
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయ, వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటువుతుంది. ఆదివారం నాడు అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొంతమేరకు ఆశాజనకం. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. గురువారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. నోటీసులు అందుతాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. సముచిత నిర్ణయం తీసుకుంటారు. గృహమార్పు అనివార్యం, వాహనం మరమ్మతుకు గురవుతుంది. సంతానం యత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాఠం
అన్నింటా మీదే పైచేయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సోమవారం నాడు పెద్దఖర్చు తగులుతుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఫోన్ సందేశాలు పట్ట అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకున్న కార్యం నెరవేరుతుంది. లక్ష్యానికి చేరువవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం చేస్తారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. బుధవారం నాడు ఆచితూచి అడుగేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. నిపుణలను సంప్రదించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ఉపాధి పథకాలపై దృష్టిపెడతారు. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు చక్కబడతాయి. నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. శనివారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని నిశితంగా గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యవహారం సానుకూలమవుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక చలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. వాహనదారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
