1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
  4. telugu rasi phalalu 2021, karkataka rashi 2021, Cancer 2021: Negatives more, opportunities came

కర్కాటకం 2021: అవకాశాలు అందినట్టే అంది... Video

telugu rasi phalalu 2021
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 14 వ్యయం: 2 రాజపూజ్యం: 6 అవమానం: 6
ఈ రాశివారికి గురుడు అష్టమ సంచారం వల్ల ధన నష్టం, ఆరోగ్య భంగం, ప్రతికూలతలు అధికం. అయితే రాహు సంచారం వల్ల కొంత మేరకు ధనలాభం, కార్యసిద్ధి వున్నాయి. లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. సంతానం విషయంలో శుభపరిణామాలు గోచరిస్తున్నాయి.
 
ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఆప్తుల సాయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య తరచూ స్వల్ప కలహాలు, బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి. ఏ పని ప్రారంభించినా తిరిగి మొదటికే వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం.
 
నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కార్మికులకు, చేతి వృత్తుల వారికి కష్టకాలం. ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం.
About Writer
రామన్
తర్వాతి కథనం
సింహ రాశి 2021: ఆరోగ్యం, సౌఖ్యం, ప్రశాంతత, ఇంకేం కావాలి?-video