1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Tulasi leaves health benefits

తులసి ఆకుల టీతో ముఖాన్ని కడిగితే..

వాతావరణ కాలుష్యాల వలన చర్మం ప్రకాశవంత రహితంగా ముఖ ఛాయను జీవ రహితంగా మార్చుతుంది. ఈ సమస్యను తులసి సహజంగా తగ్గిస్తుంది. తులసి ఆకులతో చేసిన టీతో ముఖాన్ని కడిగి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగాలి. చర్మాన్

Tulasi
వాతావరణ కాలుష్యాల వలన చర్మం ప్రకాశవంత రహితంగా ముఖ ఛాయను జీవ రహితంగా మార్చుతుంది. ఈ సమస్యను తులసి సహజంగా తగ్గిస్తుంది. తులసి ఆకులతో చేసిన టీతో ముఖాన్ని కడిగి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగాలి. చర్మాన్ని శుభ్రంగా చేస్తుంది. మీ ముఖాన్ని మెరుగుపరుస్తుంది. 
 
తులసిఆకులను మెత్తగా నూరి శరీరానికి రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మ వ్యాధులు నయవుతాయి. తులసి ఆకురసం, నిమ్మరసం కలిపి చర్మానికి పూసుకుంటే తామరవ్యాధి నయమవుతుంది. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రపూట ముఖానికి రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మెుటిమలు మచ్చలు తగ్గిపోతాయి.
 
వేపాకు మరిగించిన నీటితో తలస్నాసం చేస్తే జుట్టు ఊడటం తగ్గి వెంట్రుకలు నల్లగా బారుగా పెరుగుతాయి. వేపాకులను వేడినీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీదనున్న మచ్చలు త్వరగా పోతాయి.
 
ఒకకప్పు వేపాకు తీసుకుని అందులో కొద్దిగా నీటిని మరిగించి చల్లార్చిన తరువాత ఆ నీటిని వడగట్టి మీ ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి చాలా మంచిది. తులసిరసంలో కొంచెం తేనేకలిపి ప్రతిరోజు తీసుకుంటే బొంగురు పోయిన కంఠం చక్కగా పనిచేస్తుంది. ఒక స్పూన్ తులసిరసం ప్రతిరోజు త్రాగడం వలన రక్తం శుభ్రపడుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
వేసవిలో మీ అతిథులకు వెల్‌కం చెప్పాలంటే? ఇలా చేయండి..