మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (11:25 IST)

ఆయిలీ స్కిన్ అయితే పుల్లటి పండ్లు భేష్‌గా పని చేస్తాయట..

ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి పుల్లటి పండ్లు అంటే నిమ్మరసం, బత్తాయి, ఆరెంజ్ పండ్లు బాగా పనిచేస్తాయి. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలపి సేవించండి. దీ

ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి పుల్లటి పండ్లు అంటే నిమ్మరసం, బత్తాయి, ఆరెంజ్ పండ్లు బాగా పనిచేస్తాయి. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు మటాష్ అవుతాయి. బత్తాయి, నిమ్మరసాన్ని ముఖానికి పట్టిస్తే.. చర్మం మృదువుగా తయారవుతాయి. 
 
మహిళలు శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అందంగానే కాక ఆరోగ్యంగాను ఉంటారంటున్నారు ఆరోగ్యనిపుణలు. దీంతో మీ శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.  
 
పొడిబారిన చర్మం కలవారు అరటిపండు, తేనె, పెరుగును కలిపిన పేస్ట్‌ను ముఖానికి పూసి 15 నిమిషాలపాటుంచండి. చర్మం గతంలోకన్నా మెరుగ్గా తయారవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.