1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. Sugar beauty secreats

చర్మ సౌందర్యానికి పంచదార.. ముడతలకు చెక్ పెట్టాలంటే..?

పంచదార చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను నశింపజేస్తుంది. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుంది. పంచదా

Sugar beauty secreats
పంచదార చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను నశింపజేస్తుంది. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుంది. పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం.. పావు కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు ముదురు రంగు చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి పంచదార అణువులు కరిగే వరకు రుద్దితే మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మ మృదువుగా, తేమగా ఉంటుంది. 
 
చర్మసౌందర్యంతో పాటు బాక్టీరియాను హరింపజేసే లక్షణం కూడా పంచదార కుందని న్యూట్రీషియన్లు పేర్కొంటున్నారు. గాయాలను మాన్పడం, ఇన్ఫెక్షన్లను తొలగించే నివారిణిగా పంచదార ఉపయోగపడుతుంది. ఇక చర్మాన్ని బిగుతుగా ఉంచే యాంటీ ఏజింగ్ క్రీముల్లో తేనెను వాడతారు. ముఖం మీద మచ్చలకు కూడా తేనెను వాడుతారని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
మహిళలూ గర్భాశయ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలా? బాదం, పిస్తా, క్యాబేజీ, కాలిఫ్లవర్ తీసుకోండి