1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Another 22 Trains Will Be Availble From April 1st

ఏప్రిల్ ఒకటి నుంచి పట్టాలెక్కనున్న రెగ్యులర్ రైళ్లు...

Trains
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత రైల్వే శాఖ అన్ని రకాల రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. ఆ తర్వాత దశలవారీగా పట్టాలెక్కిస్తోంది. ఈ క్రమంలో రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కించబోతోంది. వీటిలో 22 రైళ్లను (11 జతలు) పునరుద్ధరించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది.
 
వీటిలో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, ఔరంగాబాద్, రేణిగుంట నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. మిగిలినవి తొలి వారంలో అందుబాటులోకి వస్తాయి. 
 
కొత్తగా అందుబాటులోకి రానున్న రైళ్లలో 8 డైలీ సర్వీసులు కాగా, వారానికి మూడు రోజులు నడిచేవి రెండు ఉన్నాయి. మిగిలిన 12 రైళ్లు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తాయి. ఈ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ-సికింద్రాబాద్ (02799), సికింద్రాబాద్-విజయవాడ (02800), గుంటూరు-కాచిగూడ (07251), కాచిగూడ-గుంటూరు(07252), సికింద్రాబాద్-విశాఖపట్టణం (02739), విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02740), ఆదిలాబాద్-నాందేడ్ (07409), నాందేడ్-ఆదిలాబాద్ (07410) రైళ్లు ప్రతి రోజూ నడవనుండగా, మిగతా రైళ్లలో వారానికి ఒకసారి, మూడుసార్లు నడిచేవి ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
త్వరలోనే పట్టాలెక్కనున్న స్పెషల్ రైళ్లు.. దశల వారీగా..?