1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Gold Rate Today Hyderabad: Prices Fall On October 23

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు - మెట్రో నగరాల్లో పరిస్థితి ఏంటి?

gold
రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. పండగల సీజన్‌లో బంగారం ధరలు క్రమంగా దిగిరావడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 
 
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్, తిరుపతిలో పసిడి ధరలు ఏకరీతిన కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,370గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,340 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,280గా నమోదైంది. 
 
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే, రాజధాని ఢిల్లీలో ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,520గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,490గాఉంది. ఇక ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ధరలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని బంగారం ధరలకు సమానంగా ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కోతి తలపై రూ.51 వేల రివార్డు.. చివరకు అలా చిక్కింది?