1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. International Flight services may normalise only by July

అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్!!?

International Flight Services
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ అయింది. ముఖ్యంగా, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఆపేశారు. ఈ క్రమంలో 70 రోజుల తర్వాత లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ కేంద్రం ఇపుడు.. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 
 
వచ్చేనెల నుంచి విదేశాలకు విమాన సేవలు మళ్లీ ప్రారంభించే అవకాశముందని విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాలను పాటిస్తూ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించనున్నారు. 
 
కాగా, కరోనా లాక్‌డౌన్‌తో విమానయాన రంగం కుదేలైపోయింది. విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తొలుత ఎయిర్ ఇండియా, ఆ తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది. 
 
అలాగే, దేశంలో కూడా రైలు రాకపోకలను కూడా క్రమంగా పునరుద్ధరిస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే శ్రామిక్ రైళ్లను నడిపిన రైల్వేశాఖ ఆ తర్వాత 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటి తర్వాత మరో 250 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కియా మోటార్స్‌లో కరోనా కేసు : పలువురు ఉద్యోగులకు క్వారంటైన్