శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (18:16 IST)

ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతారంటున్న హీరోయిన్.. ఎవరు? (video)

తెలుగు చిత్ర సీమలో సొట్టబుగ్గల సుందరిగా పేరొందిన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "అందాల రాక్షసి" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు నాలుగో ఐదో మినహా సరైన హిట్స్ సినిమాలు లేవు. అందుకే వెండితెరపై తళుక్కున అపుడపుడూ మెరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ అమ్మడు ఇంటికే పరిమితమై పొద్దస్తమానం సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ, ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ గడుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అభిమానులతో సంభాషిస్తూ, 'క్విజ్ మీ'లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అపుడు ఓ అభిమాని... 'మీకు మీరే ఒక వార్నింగ్ లేబుల్ ఇచ్చుకోవాల్సి వస్తే.. ఏమని ఇస్తారు'? అని ప్రశ్నించాడు. 
 
దీనికి లావణ్య స్పందిస్తూ. "నన్ను ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు" అనే లేబుల్ అంటించుకుంటానని తెలిపారు. అలాగే 'ఎలాంటి సందర్భాల్లో మీకు కోపం ఎక్కువగా వస్తుంది' అనే ప్రశ్నకు స్పందిస్తూ, 'ఎవరైనా చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఆ విషయంలో నాకు సహనం చాలా తక్కువ' అని తెలిపింది.