సంబంధిత వార్తలు
- ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గనున్నాయట..?!
- ఇంటికో ఉద్యోగం... వాషింగ్‌మెషీన్ ఫ్రీ... ఉచిత ఇల్లు... అన్నాడీఎంకే వరాల జల్లు
- డీఎంకే రూ.1000 ఇస్తే.. అన్నాడీఎంకే రూ.1500 ఇస్తుంది.. ఫ్రీ గ్యాస్ కూడా...
- వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీ గతంలో రూ.500 దాకా వచ్చేది, ఇప్పుడు రూ.16కి పడిపోయింది- ప్రెస్ రివ్యూ
- అప్పటివరకు పెట్రో భారం భరించాల్సిందే : ధర్మేన ప్రధాన్
గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యం.. ఎందుకో తెలుసా?
గ్యాస్ సిలిండర్లపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ మహమ్మారి కారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. గత 20 రోజుల్లో గ్యాస్ డెలివరీ సమయం ఒక్క రోజు నుంచి మూడు రోజులకు పెరిగింది. ప్రధాన వెండర్లకు కూడా కరోనా వైరస్ సోకడం వల్లనే. దీని తీవ్రత ఎక్కువగా ఉండడం తో గ్యాస్ డెలివరీ సమయం మరింత పెరిగే అవకాశముందని చెప్పుకోవచ్చు. 20 శాతం మంది డెలివరీ బాయ్స్‌కు కరోనా వచ్చినట్లు మనకి తెలుస్తోంది.
దీనితో గ్యాస్ వెయిటింగ్ పీరియడ్ మరింత సమయం పడే అవకాశం కనపడుతోంది. కరోనా వైరస్ జోన్‌లలో వచ్చే నెల రోజుల కాలంలో గ్యాస్ సిలిండర్ డెలివరీకి 4-5 రోజుల వరకు టైమ్ పట్టొచ్చని కూడా తెలుస్తోంది.
కాబట్టి సిలిండర్ అయిపోతే వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. లేదు అంటే ఇబ్బందులు తప్పవు. ఇది ఇలా ఉంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఏప్రిల్ నెలలో ఏకంగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.
