సంబంధిత వార్తలు
- సంక్రాంతి శోభ : టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు
- మకర సంక్రమణం ఎప్పుడు..? సంక్రాంతి నాడు గుమ్మడికాయను మరవకండి..
- నాకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు వచ్చాయి.. కోట్లిస్తానన్నారు.. కానీ వద్దన్నాను?
- #EntertainmentSuperstar సరిలేరు నీకెవ్వరు.. ఓవర్సీస్ కలెక్షన్స్ సంగతేంటంటే?
- పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 12 నుండి 16 వరకు..
సంక్రాంతి బంపర్ ఆఫర్-మెట్రో రైళ్ల టికెట్ ఛార్జ్ తగ్గింపు
సంక్రాంతి పండగ సందర్భంగా మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. మెట్రో రైళ్లలో 50 శాతం రాయితీ టికెట్ రుసుముతో ప్రయాణం చేయవచ్చని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో... నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా ఏర్పాటుచేసిన మెట్రోరైళ్లలో ప్రయాణికులను ఆకట్టుకునేలా సీఎంఆర్‌ఎల్ పలు చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో చార్జీల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. ప్రస్తుతం పొంగల్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 15, 16, 17 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ మూడు రోజులు 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చు.
17వ తేదీ కానుమ్ పొంగల్ సందర్భంగా చెన్నై మెరీనా బీచ్ నుంచి మెట్రో రైల్వేస్టేషన్లకు ప్రత్యేక క్యాబ్ వసతి ఏర్పాటుచేసింది. అలాగే, ప్రభుత్వ ఎస్టేట్, డీఎంఎస్ మెట్రో రైల్లేస్టేషన్ల నుంచి మెరీనా బీచ్‌కు క్యాబ్ వసతి కల్పించనున్నట్లు సీఎంఆర్‌ఎల్ తెలియజేసింది.
