1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. SpiceJet discount mega-sale

స్పైస్ జెట్ మెగా సేల్ ఆఫర్స్... తక్కువ ధరలకే విమానయానం

SpiceJet discount
విమానయాన రంగంలో ఆఫర్లు ప్రకటించడంలో స్పైస్ జెట్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ ఏడాది కూడా వేసవికి స్పైస్‌జెట్ మెగాసేల్ ఆఫర్స్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ను కేవలం నాలుగు రోజులు మాత్రమే అందిస్తోంది.
 
ఈ ఆఫర్ క్రింద దేశంలో స్వల్ప దూర ప్రయాణాలకు సంబంధించి ఎంపిక చేసిన రూట్లలో ఖర్చులు అన్నీ కలిపి 899 రూపాయలకే టిక్కెట్ విక్రయాన్ని ప్రకటించింది. ఇందులో దేశీయంగా ప్రయాణఛార్జీలు అతి తక్కువగా కిలోమీటరుకు రూ. 1.75, అంతర్జాతీయంగా అయితే కిలోమీటరుకు రూ. 2.5 మాత్రమే ఉంటుందని తెలిపింది.
 
ఈ ఆఫర్ ఫిబ్రవరి 5 నుండి 9 వరకు ఉంటుందని, సెప్టెంబర్ 25లోపు బుక్ చేసుకునే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. గంట కంటే తక్కువ జర్నీ ఉన్న రూట్లు బెంగుళూరు-కోచి, బెంగుళూరు-హుబ్లి, చెన్నై-బెంగుళూరు వంటి ఎంపిక చేసిన తక్కువదూర ప్రయాణ ఛార్జీలు రూ.899గా ఉంటాయి. అయితే ఈ ఆఫర్‌ను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అందిస్తామని స్పైస్ జెట్ యాజమాన్యం పేర్కొంది.
తర్వాతి కథనం
నితిన్ గడ్కరీకి ప్రశంసలు.. బల్లచరిచిన సోనియా.. అసలేం జరుగుతుంది?