శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:29 IST)

#Budget2019 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమే: రాజ్ కుమార్

కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వినియోగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం అనుకూలంగా వుంది. ఆర్థిక పన్నులపై ఈ బడ్జెట్ ప్రతికూల ప్రభావం చూపదని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజ్ కుమార్ తెలిపారు. బడ్జెట్‌పై రాజ్ కుమార్ స్పందించారు.
 
అధిక శ్లాబ్ పన్ను చెల్లింపుదారులకు తగిన ప్రయోజనాలను అందిస్తూ.. వ్యక్తిగత ఆదాయం పన్నును రూ.5లక్షలకు పెంచారని.. అదనంగా పదివేల రూపాయల ద్వారా ప్రామాణిక మినహాయింపు ఇచ్చారని.. రెండో ఇంటిపై ట్యాక్స్ రెబేట్ ప్రకటించడం.. రైతులకు కనీస మద్దతు రూ.6వేలు చేయడం వంటివి స్వాగతించదగినవని రాజ్ కుమార్ వెల్లడించారు. 
 
ఈ ప్రమాణాలన్నీ.. ఇంధన వినియోగం, అగ్రశ్రేణి కంపెనీల విలువలను పెంచుతుంది. అయితే ద్రవ్యలోటు, రుణాల మొత్తం బాండ్ మార్కెట్లో నష్టపోయే ఆస్కారం వుందని రాజ్ కుమార్ తెలిపారు.