మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Updated : గురువారం, 10 మే 2018 (13:40 IST)

బెంగళూరులో రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్‌లు... కన్ఫ్యూజన్‌లో రాజ్ కుమార్ అభిమానులు

కర్నాటక ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో పాల్గొంటున్నరాహుల్ గాంధీ ఓటర్లుకు సర్ప్రైజ్‌లు ఇస్తున్నారు. దివంగత నటుడు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి అభిమానులను సర్‌ప్రైజ్‌కు గురిచేశారు రాహుల్. అనం

కర్నాటక ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో పాల్గొంటున్నరాహుల్ గాంధీ ఓటర్లుకు సర్ప్రైజ్‌లు ఇస్తున్నారు. దివంగత నటుడు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి అభిమానులను సర్‌ప్రైజ్‌కు గురిచేశారు రాహుల్. అనంతరం బెంగుళూరులో ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌కి వెళ్లడంతో పార్లర్ యజమానితో పాటు అక్కడున్న కస్టమర్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
 
వారితో కలిసి ఐస్‌క్రీమ్ తిని ఉల్లాసంగా గడిపారు. అయితే మూడు రోజుల కిందట ఎయిర్‌పోర్టులో‌ ప్రధాని మోడీని‌ కలసి తన తండ్రి రాజ్‌కుమార్ పుస్తాకాన్ని రాజ్ కుమార్ కొడుకు పునీత్ రాజ్‌కుమార్ మోడికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకుమార్ సమాధిని సందర్శించి ‌నివాళి ఘటించడంతో ఎవరికి మద్దతివ్వాలన్న తికమకలో పడ్డారు కంఠీరవ రాజ్ కుమార్ అభిమానులు. రాహుల్ గాంధీకి రాజకీయాలు బాగా వంటబట్టినట్టే వున్నాయి.