సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (15:16 IST)

'కర్ణాటక మోస్ట్ వాంటెడ్' ప్రధానికి రాహుల్ సవాల్: 5 నిమిషాలు మాట్లాడగలరా?

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్- బీజేపీ నేతలకు మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ నేతలను ఏకిపారేస్తున్నారు. బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడంతో పాటు కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా ప్రజలక

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్- బీజేపీ నేతలకు మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ నేతలను ఏకిపారేస్తున్నారు. బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడంతో పాటు కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా ప్రజలకు వరాల జల్లు కురిస్తున్నారు. అయితే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాత్రం బీజేపీ నేతలను పట్టించుకోకుండా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకున్నారు. 
 
ఇందులో భాగంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దాడిని తీవ్రతరం చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తన ట్విట్టర్ పేజీలో ''కర్ణాటక మోస్ట్ వాంటెడ్'' పేరుతో ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మోదీకి రాహుల్ గాంధీ ఒక సవాల్ విసిరారు. 
 
కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అవినీతి గురించి, పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల అవినీతి గురించి, రెడ్డి సోదరులకు ఎనిమిది టికెట్లు ఇవ్వడం గురించి కనీసం ఐదు నిమిషాలు మాట్లాడగలరా అంటూ సవాల్ చేశారు. పీఎమ్ మోదీజీ ఎంతో మాట్లాడతారు. కానీ సమస్యల్లా మీ చర్యలు మాటలకు సరిపోవు. యడ్డీపై అవినీతి చిట్టాను రాహుల్ గాంధీ ఈ వీడియో ద్వారా ప్రధాని ముందుంచి సవాల్ విసిరారు.
 
మరోవైపు కర్ణాటక రాష్ట్రం బాగుపడాలంటే.. కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి, నల్లధనంపై ఉన్న ఆసక్తి రాష్ట్రాభివృద్ధిపై లేదన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెండూ తోడుదొంగలని, ప్రజలను మభ్య పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.