సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (13:10 IST)

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో విజయ్ సేతుపతి.. విలన్‌గా ఇరగదీస్తాడట..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ''వేద'' సినిమా యాక్టర్ విజయ్ సేతుపతి నటించడం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. పిజ్జా, జిగరతాండ ఫేమ్‌ కార్తీక్‌

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ''వేద'' సినిమా యాక్టర్ విజయ్ సేతుపతి నటించడం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. పిజ్జా, జిగరతాండ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో విజయ్ నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. 
 
వరుస హిట్లతో జోరు మీదున్న విజయ్‌కి రజనీకాంత్‌ సినిమాలో కలిసి నటించే అవకాశం రావడం ఆయన ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపింది. కాలా, రోబో సినిమాలకు తర్వాత రజనీకాంత్ నటించే ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు సుబ్బరాజ్ డైరక్షన్ చేయడం.. అలాగే విజయ్ సేతుపతి ఇందులో కీలక రోల్ చేయడం తలైవా ఫ్యాన్స్ మధ్య అంచనాలను పెంచేసింది. ఇందులో రజనీకి విలన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ఇక ''మక్కల్‌ సెల్వన్'' విజయ్‌ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి సైరాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.