సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (11:14 IST)

శింబుకున్న తెలివి కూడా రజనీ, కమల్‌కు లేదా?: అనంత్ నాగ్

తమిళ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్‌లపై కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ ధ్వజమెత్తారు. కమల్, రజనీకాంత్ నటులిద్దరూ కరుడుగట్టిన రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కావేరి జలాల పంపిణీ అంశం

తమిళ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్‌లపై కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ ధ్వజమెత్తారు. కమల్, రజనీకాంత్ నటులిద్దరూ కరుడుగట్టిన రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కావేరి జలాల పంపిణీ అంశంపై వీరిద్దరు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.

తమిళనాడుకు ఎంత వాటా వస్తుందో, ఆ వాటాను కర్ణాటక ఇవ్వాలని తమిళ యువ నటుడు శింబు అన్నాడని, ఆ మాత్రం పరిపక్వత కూడా రజనీకాంత్, కమల్ హాసన్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నాడు. 
 
కర్ణాటక నుంచి తమిళనాడు నీళ్లివ్వాలని శింబు తన ప్రెస్‌మీట్ సరిగ్గా అడిగాడని.. అతని మాటల్లో రాజకీయాలు కనిపించలేదని.. అయితే రజనీ, కమల్ వ్యాఖ్యల్లో రాజకీయ నేతల శైలి బాగా కనిపిస్తోందని అనంత్ నాగ్ దుయ్యబట్టారు. వచ్చే నెలలో కర్ణాటకలో కొత్త సర్కారు ఏర్పడబోతుందని.. అప్పటివరకైనా నటులిద్దరూ ఆగివుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
తమిళ రాజకీయ నేతలు కావేరీ వివాదాన్ని పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేస్తున్నారని అనంత్‌ నాగ్ ఆరోపించారు. ఆఫ్రికాలో నైలు నది సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జలవివాదాలు పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు. 

కానీ, తమిళ నేతలు మాత్రం కావేరీ వివాదానికి మాత్రం పరిష్కారం చూపకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారని ఆరోపించారు. 138 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం ఇంకెన్నాళ్లు కొనసాగాలని ప్రశ్నించారు. కన్నడిగుల మంచితనాన్ని చేతకాని తనంగా భావించవద్దని హెచ్చరించారు.