శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (09:25 IST)

ప్రేమ విఫలం.. ఫినాయిల్ తాగి నటుడి ఆత్మహత్యాయత్నం

ప్రేమ విఫలం కావడంతో ఓ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన నివాసంలోనే ఫినాయిల్ సేవించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

ప్రేమ విఫలం కావడంతో ఓ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన నివాసంలోనే ఫినాయిల్ సేవించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హుచ్చ వెంకట్ అనే నటుడు కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఓ నటిని గాఢంగా ప్రేమించాడు. అయితే ఆమె ఇంట్లోని వారు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రేమ విఫలమైందని పేర్కొంటూ ఆదివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 
 
ఈ సమయంలో వెంకట్... స్నేహితులపై విరుచుకుపడ్డాడు. చికిత్స అందిస్తున్న వైద్యులపైనా చిర్రుబుర్రులాడాడు. దీంతో వెంకట్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంకట్ నటించిన కన్నడ సినిమా 'పోకిరి' అట్టర్‌ప్లాప్ కావడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని సన్నిహితులు ఆరోపిస్తున్నారు.