మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (11:42 IST)

కన్నడ నటుడు ఆత్మహత్య... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా...!

కన్నడ నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనయ పేరు ధృవ్ శర్మ. స్టార్ సెలబ్రిటీ క్రికెట్ ద్వారా (సీసీఎల్) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధృవ్... సొంత కంపెనీలో నష్టాలు, అప్పుల్లో చిక్కుకుని చివరకు తన

కన్నడ నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనయ పేరు ధృవ్ శర్మ. స్టార్ సెలబ్రిటీ క్రికెట్ ద్వారా (సీసీఎల్) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధృవ్... సొంత కంపెనీలో నష్టాలు, అప్పుల్లో చిక్కుకుని చివరకు తనువు చాలించాడు. శనివారం రోజు ధృవ్ పురుగులమందు తాగి ఆత్మహత్యకి పాల్పడగా కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశాడు. 
 
35 ఏళ్ళ వయస్సులో ధృవ్ హఠాన్మరణం అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయన మృతిని కన్నడ పరిశ్రమ అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. టీమిండియా డెఫ్ అండ్ డంబ్ క్రికెట్ కెప్టెన్‌ వ్యవహరించిన ధృవ్ వరల్డ్ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. 
 
ఇక స్నేహాంజలి సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లో అడుగుపెట్టిన ధృవ్.. బెంగళూరు–560023, నీనంద్రే ఇష్టకనో, టిప్పాజీ వంటి హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. ఇతను నటించిన కిచ్చు సినిమా విడుదల కావాల్సి ఉంది. మాటలు రాకపోయిన డైరెక్టర్ పేపర్ రాసి సీన్ వివరిస్తే ఇక ఆ సీన్‌లో తాను అల్లుకుపోయేవాడట.