బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 9 మే 2018 (16:07 IST)

నీకెంత అహంకారం.. అంత మాట అంటావా? రాహుల్‌పై మోడీ మండిపాటు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జరిగిన ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ, 2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జరిగిన ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ, 2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తాను ప్రధానమంత్రిని అవుతానంటూ ప్రకటించారు.
 
ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మండిపడ్డారు. రాహుల్ కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. "నిన్న ఒకాయన చాలా ముఖ్యమైన ప్రకటన చేశారు. నేనే ప్రధాని అవుతా అని ఆయన అన్నారు. ఎంతోమంది సీనియర్లు ఉండగా ఆయనెలా ప్రధాని అవుతారు. అయినా తనకు తాను నేనే ప్రధాని అవుతా అని ఎవరైనా ఎలా ప్రకటించగలరు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి. 40 ఏళ్లుగా ఎంతో మంది నేతలు వేచి చూస్తున్నారు. ఆయన సడెన్‌గా వచ్చి నేనే ప్రధాని అవుతా అంటున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనడానికి రాహుల్ మాటలే నిదర్శనమని" అని మోడీ బుధవారం జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుడా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ వరుసగా ఓడిపోతుంటే రాహుల్ ఇలాంటి కలలు ఎలా కంటున్నారు.. ముందు రాష్ట్రాల‌ ఎన్నికల్లో గెలవండి చూద్దాం అంటూ బీజేపీ సవాల్ విసిరింది.