1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
  4. prostitution in chennai OMR and three persons arrest

చెన్నై ఓఎమ్మార్ లో ఆంధ్ర అమ్మాయిలను భయపెట్టి వ్యభిచారం

chennai OMR
అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని అందరు అంటుంటారు... అనే పాటలో పల్లవిలో అనుకున్నట్లు కొందరు అమ్మాయిలు నగరాల్లో టీవీ, సినిమా నటీమణులుగా వెలిగిపోవాలని వస్తుంటారు. అమాయకంగా నగరంలో అడుగుపెట్టిన వారిని బుట్టలో వేసుకుంటారు కొందరు నయవంచకులు. వారికి సినిమా ఆఫర్ల ఆశ చూపి నేరుగా వ్యభిచార కూపంలోకి నెట్టివేస్తున్నారు. 
 
తాజాగా ఇలాంటి వ్యవహారం చెన్నైలో ఐటీ హబ్‌లుగా పేరొందిన ఈసీఆర్, ఓఎమ్మార్ లలో వెలుగుచూసింది. ఆంధ్ర, కర్ణాటక, ముంబైలకు చెందిన ఐదుగురు అమ్మాయిలను నిర్భందించి, బెదిరిస్తూ వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఐటీ ఉద్యోగుల్లా నటిస్తూ ఓఎమ్మార్, ఈసీఆర్ పరిధిలో ఉద్యోగాలు చేస్తున్న యువకులకు వల వేసి వారిని రప్పిస్తున్నట్లు సమాచారం. 
 
ఇందుకుగాను సినిమా ఆఫర్ల కోసం వచ్చిన ఐదుగురు అమ్మాయిలను టీవీ సీరియల్స్ నటి షీలా పగడ్బందీగా వలపన్ని ఇక్కడికి తరలించి వ్యభిచార కూపంలోకి నెట్టింది. వారిని బెదిరించి వారితో వ్యభిచారం చేయిస్తోంది. విషయం పోలీసులకు చేరడంతో వారిని అదుపులోకి తీసుకుని బాధితులను మహిళా సంరక్ష కేంద్రానికి తరలించారు.