1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
  4. Stray dog chained, dragged into truck by two persons in Chennai

చెన్నై నిండుగా కుక్కలే... రాత్రైతే చాలు కరిచేస్తాయి... ఆ కుక్క మెడకు రెండు తాళ్లు(వీడియో)

చెన్నై మహానగరం శివార్లలో రాత్రి 8 దాటితే చాలు కుక్కలు మామూలుగా వుండవు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఆఖరికి నాలుగు చక్రాల వాహనాల వెంట కూడా పడుతుంటాయి. ఈ కుక్కల బెడదను వదిలించండి బాబోయ్ అని మొర పెట్టుకున్న పట్టించుకునే నాధుడు వుండడు. దీంతో కుక్కలు రె

Stray dog
చెన్నై మహానగరం శివార్లలో రాత్రి 8 దాటితే చాలు కుక్కలు మామూలుగా వుండవు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఆఖరికి నాలుగు చక్రాల వాహనాల వెంట కూడా పడుతుంటాయి. ఈ కుక్కల బెడదను వదిలించండి బాబోయ్ అని మొర పెట్టుకున్న పట్టించుకునే నాధుడు వుండడు. దీంతో కుక్కలు రెచ్చిపోతున్నాయి. ద్విచక్ర వాహనదారులు కొన్నిసార్లు కుక్కల దాడితో కిందపడి తీవ్ర గాయాలపాలైన సందర్భాలు కూడా వున్నాయి. కుక్కలను పట్టుకునే వారికి ఫిర్యాదు చేస్తే ఓ పట్టాన వాళ్లు రారు. 
 
వీటిని పట్టుకునేందుకు కూడా పొలిటికల్ సైడ్ నుంచి ప్రెజర్ రావాలి. అప్పుడే కుక్కల బండి వస్తుంది. ఐతే ఆ బండి వచ్చేటప్పటికి ఒక్క కుక్క కూడా వారికి దొరకదు. కానీ తాము వచ్చి వెళ్లిపోయామని రాసేసుకుని వెళ్లిపోతుంటారు వారు. సర్లే ఇదిలావుంటే తాజాగా కుక్కల్ని పట్టుకుని వెళ్లేవారు ఓ కుక్క మెడకు రెండు తాళ్లు బిగించి దాన్ని కుక్కల బండిలో వేశారు. ఐతే వాళ్లు పట్టుకున్న వైనం కాస్తా సోషల్ మీడియాకు ఎక్కింది. ఇది కాస్తా కేంద్ర మంత్రి మేనకా గాంధీ దృష్టికి వెళ్లింది. ఆమె విచారణకు ఆదేశించారు. దీనితో అంతా ఎలెర్ట్ అయ్యారు. 
 
మూగజీవాన్ని అంత దారుణంగా ఆ యువకులు మెడకు తాళ్లు కట్టేసి పట్టుకెళ్లడంపై బ్లూ క్రాస్ సంస్థ ద‌ర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో వాళ్లు కుక్కలు పట్టుకునేందుకు వచ్చినవారనీ, వాళ్లు ఓ వ్యానులో వచ్చారనీ, ఆ వ్యానులో 11 కుక్కలు కూడా వున్నాయనీ, వాటితో పాటు ఈ కుక్కను కూడా పడేసినట్లు తేలింది. ఐతే కుక్కను అంత దారుణంగా పట్టుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అంతా బాగానే వుంది కానీ... జనంపై ఎగబడి పళ్లతో పీకుతున్న కుక్కల బెడదను ఎలా కంట్రోల్ చేయాలో.. వాటిని ఎలా నిరోధించాలో అనే దానిపై ఎవరూ స్పందించరే... పైగా దీని గురించి ఎక్కడా చర్చ కూడా వుండదు. కుక్కలు కరిచిన వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రిల వద్ద ర్యాబిస్ వ్యాక్సిన్లు దొరక్క, వాటిని వారాల పాటు వేయించుకుంటూ నానా ఇక్కట్లు పడుతుంటారు. మరి ఈ వీధి కుక్కలను ఎలా నియంత్రించాలన్నదానిపై కూడా కాస్త చర్చ జరిగితే బావుంటుందేమో? తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల ఓ బాలుడిని, ఓ వృద్ధురాలిని వీధి కుక్కలు ఎలా కరిచి కరిచి పెట్టాయో తెలిసిందే. చూడండి చెన్నై కుక్క వీడియోను... 
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
చెన్నైలో మళ్లీ మూగజీవిపై దారుణం: కుక్క మెడకు తాడు కట్టి ఇద్దరూ చెరో వైపు లాక్కెళ్లారు