శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (09:44 IST)

41 మంది పాదచారులను కరిచేసింది.. మున్సిపల్ అధికారులు పట్టుకోలేకపోయారు..

చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రె

చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రెచ్చిపోయింది. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రికి వచ్చి ఇంజెక్షన్లు చేయించుకున్నారు. కుక్క కాటుకు గురై తీవ్రంగా గాయపడిన 28 మందిని వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
కొందరిని ఈ కుక్క కరిచేసిందని.. మరికొందరు పరుగులు తీస్తూ కిందపడి గాయపడ్డారని చెంగల్పట్ ఆసుపత్రి డీన్ డాక్టర్ గుణశేఖరన్ చెప్పారు. కుక్క దాడి ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా కుక్కను పట్టుకోలేక పోయారు. అధికారులు కుక్కను పట్టుకోలేక పోతే తామే దాన్ని పట్టుకొని చంపేస్తామని స్థానికు హెచ్చరిస్తున్నారు.