1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

ఆనియన్ టమోటో టార్ట్

వంటకాలు చైనీస్ పేస్ట్రీ మైదాపిండి బట్టర్ ఫిల్లింగ్ పేస్ట్రీ ఆనియన్ టమోటో టార్ట్ నూనె టమోటో కెచప్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు
కావలసిన పదార్థాలు :
పేస్ట్రీ కోసం...
మైదాపిండి... ఒకటిన్నర కప్పు
బట్టర్... అరకప్ప

ఫిల్లింగ్ కోసం...
నూనె... నాలుగు టీస్పూన్లు
టమోటో కెచప్... మూడు టీస్పూన్లు
క్యాప్సికమ్... రెండు
ఉల్లిపాయలు... అరకేజీ
ఉప్పు... తగినంత
టమోటోలు... మూడు

తయారీ విధానం :
క్యాప్సికమ్, టమోటో, ఉల్లిపాయలను చక్రాలలాగా తరగాలి. పాన్‌లో ఉల్లిపాయలను నూనె వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోనే క్యాప్సికమ్‌ను కూడా చేర్చి మామూలు మంటమీద రెండు నిమిషాలపాటు ఉడికించాలి. ఆపైన టమోటో ముక్కలను కూడా చేర్చి మరో రెండు నిమిషాలపాటు వేయించి సరిపడా ఉప్పు కలుపుకోవాలి.

మైదా, బట్టర్‌ను బాగా కలిపి కొద్దిగా నీరు చేర్చి ముద్దగా చేయాలి. దీన్ని ఒక పొరలాగా తయారు చేసుకోవాలి దీన్నే పేస్ట్రీ అంటారు. ఈ పేస్ట్రీపైన వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ, టమోటో, క్యాప్సికమ్ ముక్కలను ఒకదాని తరువాత ఒకటి పరుస్తూ... పైన టమోటో కెచప్‌ను కూడా సమంగా పరచాలి.

ఇలా చేసుకున్న పేస్ట్రీని ఓవెన్‌లో పావుగంటసేపు తగినంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి. బాగా కాలిన తరువాత తీసి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే వేడి వేడి ఆనియన్ టమోటో టార్ట్ రెడీ అయినట్లే...! వీటిని ఏదేని సాస్ లేదా గ్రీన్ చట్నీతో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి